telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సీఎం జగన్‌కు ముద్రగడ సూచన

సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ప్రభుత్వమే విక్రయించేలా ప్రణాళిక చేపట్టినట్లుగా ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం ప్రస్తావిస్తూ.. తాజాగా మాజీ ఎగ్జిబిటర్ అయిన ముద్రగడ పద్మనాభం ఏపీ సీఎం జగన్‌కు ఓ సూచన చేశారు. టాలీవుడ్‌పై ఏపీ ప్రభుత్వానికి ఆయనిచ్చే సూచన ఏమిటో తెలుపుతూ ఓ ప్రెస్‌నోట్‌ని అధికారికంగా ముద్రగడ విడుదల చేశారు.

ఇందులో.. సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించే విధానం చాలా మంచిదని తెలిపిన ముద్రగడ.. చిత్ర నిర్మాణం కోసం నటించే హీరో, హీరోయిన్లు మొదలుకొని ఆ సినిమాకు భాగమయ్యే ప్రతి ఒక్కరికి ఇచ్చే కిరాయిని.. అలాగే కేరావేన్లు, ఇతర వాహనాలకు, రూమ్ అద్దెలకు, టిఫిన్లు, భోజనాలు వగైరా అన్నింటికి అయ్యే ఖర్చు నిర్మాత దగ్గర నుంచి ముందే మొత్తం డబ్బును ప్రభుత్వం జమ చేయించుకుని.. ఆన్‌లైన్‌ టిక్కెట్లు మాదిరిగా వారి బ్యాంకు ఖాతాలకు పంపించే ప్రణాళిక చేస్తే బాగుంటుందని కోరారు. దీని వల్ల నలుపు, తెలుపు ధనం అనే మాట వినబడదని.. అలాగే చిత్ర నిర్మాణానికి కూడా ఖర్చు తగ్గుతుందని ఆయన సూచన చేశారు. మరి ఈ సూచనను ప్రభుత్వం తీసుకుంటుందా?. ఒక వేళ తీసుకుంటే సినిమా ఇండస్ట్రీ నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Related posts