telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

టీమిండియాకు ధోనీ నీడలాంటివాడు: రవిశాస్త్రి

ravi shastri coach

టీమిండియాకు ధోనీ నీడలాంటివాడని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నారు. క్రికెట్ నుంచి ఎప్పుడు వైదొలగాలో ధోనీకి తెలుసని చెప్పారు. క్రికెట్ కు ధోనీ ముగింపు పలకాలని కొందరు తహతహలాడుతున్నారని మండిపడ్డారు. ధోనీ రిటైర్మెంట్ పై వ్యాఖ్యలు చేయడమంటే అతడిని అవమానించినట్టేనని రవిశాస్త్రి వ్యాఖ్యానించారు.

ధోనీని విమర్శిస్తున్నవారిలో సగం మందికి షూ లేసులు కూడా కట్టుకోవడం చేతకాదని ఎద్దేవా చేశారు. చర్చించడానికి వేరే విషయాలు లేకనే ధోనీ రిటైర్మెంట్ పై కొందరు చర్చిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో క్రికెట్ కు ధోనీ వీడ్కోలు పలుకుతాడనే విషయం అందరికీ తెలుసని అన్నారు. సమయం వచ్చినప్పుడు ఆయనే నిర్ణయం తీసుకుంటాడని చెప్పారు.

Related posts