telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ సినిమా వార్తలు

ధోని సేవలను ప్రశంసిస్తూ ప్రధాని మోడీ లేఖ

Dhoni

భారతదేశం యొక్క అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని నిలిచాడు. తన కెప్టెన్సీలో మూడు ఐసీసీ ట్రోఫీలు అందించడమే కాకుండా 2009 లో భారత జట్టును టెస్ట్ లో నెంబర్ వన్ జట్టుగా నిలిపాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెబుతూ టీమిండియా‌ ధోని ఆగస్టు 15న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత క్రికెట్‌కు ధోని చేసిన కృషికి ప్రధాని నరేంద్రమోదీ కృతజ్ఞతలు తెలిపారు. ధోని కోసం ప్రధాని మోడీ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు. “మీరు వీడ్కోలు పలకడంతో 130 కోట్ల మంది భారతీయులు నిరాశ చెందారు, మీరు భారత క్రికెట్ కోసం చేసిన సేవలకు కృతజ్ఞతలు. ఇకనైనా సాక్షి, జివా మీతో ఎక్కువ సమయం గడపాలని ఆశిస్తున్నాను” అని మోదీ తెలిపారు. క్రికెట్ మైదానంలో ధోని సాధించిన విజయాలను, అలాగే భారతదేశం కోసం అతను చేసిన సేవలను ప్రధాని మోడీ ప్రశంసించారు. దీనిపై ధోని స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా “ఒక ఆర్టిస్ట్, సోల్జర్ మరియు స్పోర్ట్స్ పర్సన్ కోరుకునేది ప్రశంసలు, అప్పుడే వారి కృషి మరియు త్యాగం అందరిచేత గుర్తించబడుతుంది. మీరు అందించిన ప్రశంసలకు మరియు శుభాకాంక్షలకు ధన్యవాదాలు” అని ధోని ట్వీట్ చేశారు.

Related posts