telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మిస్టర్ సల్మాన్ ఖాన్.. నన్ను ఈ విషయంలో బ్లేమ్ చేయడం ఆపండి : కేఆర్‌కే

KRK

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు కారణం బాలీవుడ్ ప్రముఖులే అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. స్టార్ వారసులను తప్ప బయటి వారిని ఎదగనివ్వడం లేదని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ను చాలా మంది టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ (కేఆర్‌కే) కూడా సల్మాన్‌ను విమర్శించాడు. దీంతో కేఆర్‌కేను సల్మాన్ ఖాన్ పీఆర్ టీమ్ హెచ్చిరించిందట. దీంతో కేఆర్‌కే ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చాడు. “మిస్టర్ సల్మాన్ ఖాన్.. నేను నీకు వ్యతిరేకంగా ఎలాంటి ట్వీట్ గాని, వ్యాఖ్యలు గాని చేయలేదు. నేను నీకు వ్యతిరేకం కాదు. పబ్లిక్ నీకు వ్యతిరేకంగా ఉన్నారు. మీడియా నీకు వ్యతిరేకంగా ఉంది. మీడియాలో వస్తున్న వార్తలకు నన్ను తప్పుబట్టడం ఎందుకు? నన్ను ఈ విషయంలో బ్లేమ్ చేయడం ఆపండి” అని కేఆర్‌కే ట్వీట్ చేశాడు.

Related posts