telugu navyamedia
సినిమా వార్తలు

“మిస్టర్ మజ్ను” పబ్లిక్ టాక్

Mr.Majnu

అక్కినేని అఖిల్, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం “మిస్టర్ మజ్ను”. “తొలిప్రేమ” చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ లు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.

ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లోజరిగింది. ఈ సినిమా ప్రీమియర్లు ఇప్పటికే పలు చోట్ల ప్రదర్శితం అయింది. సినిమా చూసిన అక్కినేని అభిమానులు, ప్రేక్షకులు ఎలా ఉందనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. సినిమా ప్రథమార్థం చాలా బాగుందని, ద్వితీయార్థం ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకుందని, మరోసారి వెంకీ అట్లూరి తన సెన్సిబుల్ మేకింగ్ తో మంచి సినిమాను అందించారని, ద్వితీయార్థం కాస్త నెమ్మదించినా అఖిల్ తన నటన, డ్యాన్స్, ఫైట్లతో ఆకట్టుకున్నాడని, ఈసారి అఖిల్ కు హిట్ పడినట్లేనని తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Related posts