telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక సినిమా వార్తలు

మార్కెట్లో ఎంఆర్ చౌదరి ఆటోమేటిక్ శానిటైజేషన్ “వారియర్ “

MR-Chowdary

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ ను పొడిగిస్తూ ఇచ్చిన పలు సడలింపులతో హైదరాబాద్ లో పరిస్థితులు మళ్ళీ మామూలవుతున్నాయి. షాప్ లు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచడానికి అనుమతినిచ్చారు. ఇక బయటకు వచ్చే ప్రతి ఒక్కరికి మాస్కులు తప్పనిసరి చేశారు. కరోనా వైరస్ మహమ్మారి నుంచి మానవాళికి ఇప్పట్లో ఉపశమనం లభించే సంకేతాలు కనుచూపుమేరలో కనిపించడం లేదు. రోజు రోజుకూ వైరస్ వ్యాప్తి మరింత తీవ్రమవుతోంది. మరోవైపు కరోనా వైరస్‌ను నియంత్రించే వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాస్తవ్యుడు, సినిమా ప్రముఖ నిర్మాత ఎం.ఆర్ చౌదరి ఆటోమేటిక్ శానిటైజేషన్ మెషీన్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

MR1

ప్రస్తుత పరిస్థితిలో ప్రతి షాపులో, సూపర్ మార్కెట్లలో ఎక్కడ చూసిన కొనుగోలుదారులకు శానిటైజర్ ను అందించడానికి ఒక వ్యక్తిని నియమిస్తున్నారు. ఆ వ్యక్తి షాపులోకి వచ్చిపోయేవారికి శానిటైజర్ ను అందిస్తూ ఉండాలి. అయితే ఇప్పుడు ఈ ఆటోమేటిక్ శానిటైజేషన్ మెషీన్ ద్వారా వినియోగదారులు వారంతట వారే శానిటైజేషన్ ను ఉపయోగిచుకొనే అవకాశం వుంది. ఆటోమేటిక్ శానిటైజేషన్ మెషీన్ కింద చేతులు పెడితే చాలు దానంతట అదే శానిటైజర్ ను స్ప్రే చేస్తుంది.

MR Chowdary

ఈ సందర్భంగా నిర్మాత ఎం.ఆర్ చౌదరి మాట్లాడుతూ “మేము మల్టీ నేషనల్ కంపెనీలకు మస్కిటో రేపల్లెన్ట్ (mosquito repellent) తయారుచేసి ఐఎస్ఓ 2000 స్టాండర్డ్స్ లో బల్క్ గా సప్లై చేస్తాము. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మా లిక్విడ్ ఉంటుంది. అయితే ఈ 45 రోజుల లాక్ డౌన్ సమయంలో ప్రజలకు ఏదో చేయాలని అనుకున్నాము. ఇకపై భవిష్యత్తు శానిటైజేషన్ పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేయాలనుకున్నాము.

MR Chowdary

పైగా మా ఎండి నాగరాజు గారు మెషీన్ టూల్ డిజైనర్. ఆయన, మా కంపెనీలోని ఇంజనీర్స్ కలిసి ఈ ఆటోమేటిక్ శానిటైజేషన్ మెషిన్ ను కనిపెట్టారు. ఈ నెల 20న ఆ మెషీన్ ను శ్రీమతి జీవితా రాజశేఖర్, నటుడు బెనర్జీ, డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి మార్కెట్లోకి విడుదల చేశారు. ఆ ఆటోమేటిక్ శానిటైజేషన్ మెషీన్ కు అద్భుతమైన స్పందన వస్తోంది.భారీగా ఆర్డర్స్ కూడా వస్తున్నాయి” అని తెలిపారు.

MR Chowdary

వలస కూలీలు, పేద ప్రజలు, పారిశుద్ధ్య కార్మికులు, రేషన్ కార్డు లేని వారు… ఇలా దాదాపుగా 300 నుంచి 500 మందికి ఈ లాక్ డౌన్ సమయంలో సహాయం చేశాము అన్నారు. ఏది ఏమైనా ఈ కరోనాకు మందు లేని సమయంలో ఇలాంటి ఒక ఆటోమేటిక్ శానిటైజేషన్ మెషీన్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టడం అభినందించదగ్గ విషయం. ఇక మే 25 సోమవారం రోజు చౌదరి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎం.ఆర్ చౌదరికి నవ్యమీడియా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

విమలత

Related posts