telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు తేదీ ఖరారు

తెలంగాణ పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటలకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపును చేపట్టనున్నట్లు తెలిపింది. ఇందుకోసం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 123 లెక్కింపు కేంద్రాల్లో 978 లెక్కింపు హాళ్లలో ప్రక్రియ కొనసాగనుంది.

ప్రతిపక్షాల విజ్ఞప్తితో ఈ నెల 27న జరగాల్సిన కౌంటింగ్ వాయిదా పడ్డ విషయం తెలిసిందే. నిన్న పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ వెలువడింది. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు ప్రమాణస్వీకారం కంటే ముందే చైర్‌పర్సన్లను ఎన్నుకునే వెసులుబాటు కలిగింది. ఈ లెక్కింపు ప్రక్రియలో సుమారు 34 వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు.

Related posts