telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీడీఓ సస్పెన్షన్‌!

ktr trs

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నల్లగొండ జిల్లా చండూరు ఎంపీడీవో సీహెచ్ నరేందర్‌ పై అధికారులు సస్పెన్షన్‌ వేటు వేశారు. కేటీఆర్ ను తిడుతున్న నరేందర్ వాయిస్ రికార్డ్ వైరల్ కాగా, అధికారులు సీరియస్ గా తీసుకున్నారు.

దీనిపై కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ విచారణకు ఆదేశించి, నరేందర్ ను సస్పెండ్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఆపై కొందరు ఎంపీడీఓలు జరిగిన విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి విషయాన్ని వెల్లడించారు. నరేందర్‌ తొందర పాటులో అలా మాట్లాడి ఉండవచ్చని కేటీఆర్ కు వివరించారు. ఉన్నతాధికారులతో తాను మాట్లాడి సస్పెన్షన్‌ ఎత్తివేయించేందుకు ప్రయత్నిస్తానని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

Related posts