telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ అంటే నాకెప్పుడూ గౌరవం ఉంటుంది: సుజనా చౌదరి

ఇటీవలే టీడీపీని వీడి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అంటే తనకెప్పుడూ గౌరవం ఉంటుందని అన్నారు. టీడీపీ తనకు రాజకీయంగా మాతృ సంస్థ అని, టీడీపీని విమర్శించాల్సిన అవసరం తనకు లేదని సుజనా చౌదరి పేర్కొన్నారు.

టీడీపీని ఇప్పడు కూడా తానేమీ అనాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండాలి కానీ శత్రుత్వం మాత్రం ఉండకూడదని తాను భావిస్తున్నానని సుజనా చౌదరి పేర్కొన్నారు. టీడీపీకి తిరిగి వైభవం ఎప్పుడు వస్తుందనేది తాను ఇప్పుడైతే చెప్పలేనన్నారు.

Related posts