telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

విద్యార్థి సునీల్ నాయక్ ది ప్రభుత్వ హత్యే…

revanthreddy campaign in huzurnagar

కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సునీల్ నాయక్ ఆత్మహత్యా సంచలనంగా మారుతుంది. అయితే దీని పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి స్పందిస్తూ… విద్యార్థి సునీల్ నాయక్ ది ప్రభుత్వ హత్యేనని ఆరోపించిన ఆయన.. కేసీఆర్ అండ్ కో ఉద్యమ సమయంలో విద్యార్థులను రెచ్చగొట్టి చావులకు కారణమయ్యారని.. ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వక మరోసారి వాళ్ల చావులకు కారణమవుతున్నారని మండిపడ్డారు.. కేసీఆర్ కుటుంబ వైభోగం కోసం యువత ఇంకెన్నాళ్లు బలిదానాలు చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఎంపీ రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో లక్షా 91 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ చెప్పిందని.. కానీ, ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన టీఎస్పీఎస్సీ కమిటీకే దిక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి 27 నెలలైనా నిరుద్యోగ భృతి అతీగతీ లేదని విమర్శించిన రేవంత్.. తక్షణం లక్షా 91 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని.. ఏప్రిల్ నెల నుంచే నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే చుడాలికి మరి ఈ వివాదం ఇంకా ఎక్కడి వరకు వెళ్తుంది అనేది.

Related posts