telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

80 ఏళ్ళ వయసులో అంతర్జాతీయ గుర్తింపు… పెయింటింగ్స్ తో ఆకట్టుకుంటున్న బామ్మ

MP

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉమారియా జిల్లా లోర్హా గ్రామానికి చెందిన గిరిజన మహిళ జోధయ్య బాయి బైగా మాత్రం ఏంచక్కా కుంచె పట్టుకుని బొమ్మలు గీసేస్తుంది. 80 ఏళ్ల వయసులో కూడా ఆమె గీసే పెయింటింగ్స్‌ అత్యంత కళాత్మకంగా ఉంటూ అందరినీ ఇట్టే కట్టిపడేస్తుంటాయి. తాజాగా ఈ బామ్మ ఆర్ట్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో బామ్మ గీసిన బొమ్మలు ప్రదర్శనకు వెళ్తున్నాయి. ఇటలీలోని మిలాన్‌లో జరుగుతున్న ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ఈమె పెయింటింగ్స్ ప్రదర్శనకు అవకాశం దక్కింది. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. బామ్మ గురువు ఆశిష్ స్వామి కూడా ఆమెకు దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జోధయ్య బాయి 40వ యేటా ఆమె భర్త మృతి చెందారు. దాంతో ఒంటరి అయిన ఆమె ఆర్ట్‌పై మక్కువ పెంచుకుంది. అదే ఆమె ప్రపంచం అయింది. అప్పటి నుంచి గత నాలుగు దశాబ్దాలుగా బొమ్మలు గీయడంతోనే కాలం వెళ్లదీస్తుందామె. తాను అన్నీ రకాల జంతువుల బొమ్మలు గీయడంతో పాటు తన చుట్టూ జరిగే ప్రతీ విషయాన్ని ఆర్ట్ రూపంలో తెలియజేయగలనని జోధయ్య బాయి తెలిపింది. పెయింటింగ్ తప్ప తనకు మరో విషయం తెలియదని, 40 ఏళ్ల క్రితం భర్త చనిపోయినప్పటీ నుంచి ఇదే పని చేస్తున్నట్లు వివరించింది. మనుగడ కోసం, తన కుటుంబాన్ని చూసుకోవటానికి తాను ఏదో ఒకటి చేయాల్సి వచ్చిందని దాంతో ఈ ఆర్ట్‌ను ఎంచుకున్నట్లు చెప్పుకొచ్చింది. తన పెయింటింగ్ అంతర్జాతీయ వేదికపై ప్రదర్శితం కాబోతున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఆమె మీడియాతో మాట్లాడుతూ చెప్పింది. ఆమె గురువు గురువు ఆశిష్ స్వామి మాట్లాడుతూ… భర్త చనిపోయిన తర్వాత ఆ బాధ, దు:ఖాన్ని దిగమింగుకొని పూర్తిగా ఆమె ఆర్ట్‌పైనే ఫోకస్ చేసిందన్నారు. 80 ఏళ్ల వయసులో కూడా ఆమె పెయింటింగ్ పట్ల చూపే శ్రద్ధ అమోఘమన్నారు. తన శిష్యురాలి పెయింటింగ్స్ అంతర్జాతీయ వేదికపై ప్రదర్శితం కావడం ఆమెకు దక్కిన అరుదైన గౌరవం అన్నారు. సరైన విద్య లభించని ఆదివాసీలకు ఇది గర్వకారణమని ఆయన తెలిపారు. వయసుతో సంబంధంలేకుండా ఎవరైనా తమలోని టాలెంట్‌ను బయటపెట్టొచ్చని, దీనికి ఈ బామ్మే ఆదర్శమన్నారు.

Related posts