telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

“గెలిపిస్తే గోదావరి ప్రక్షాళన చేయిస్తా -“మాగంటి రూప

Murali MOhan

రాజమండ్రి లోక్ సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్హి మాగంటి రూప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంగన భరత్, జనసేన పార్టీ అభ్యర్థి ఆకుల సత్యనారాయణ… ఈ ముగ్గురూ ప్రచారంలో ముగ్గురు తమదైన పద్దతిలో దూసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తరుపున మాగంటి మురళి మోహన్ విజయం సాధించారు. ఈసారి ఆయన ఆరోగ్య కారణాల వల్ల పోటీ చేయడం లేదు. మురళి మోహన్ కోడలు రూపను ముఖ్యమంత్రి చంద్ర బాబు ఎంపిక చేశారు.

Rupa

రూప బాగా చదువుకుంది. భర్త రామ్ మోహన్ తోవ్యాపార రంగంలో వుంది. ముఖ్యమంత్రి చంద్ర బాబు ఆదేశం, మామ మురళి మోహన్ ఆశీర్వచనంతో రాజకీయాల్లోని అడుగుపెట్టింది రూప. రాజమండ్రి ప్రతిష్టాత్మక నియోజకవర్గం. ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరికి వారే గెలుపుపై ధీమాగా వున్నారు. అయితే మాగంటి రూప కు ఎన్నో ప్రత్యేకతలు వున్నాయి. 

Bharat

Bharath

ఆమె ఒకప్పటి నిర్మాత, దర్శకుడు యు. విశ్వేశ్వర రావు మనవరాలు. విశ్వేశ్వర రావుగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు సమీప బంధువు. రామారావు కుమారుడు కెమెరామన్ మోహన్ కృష్ణ భార్య అక్క కూతురు రూప. ఇక నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త మాగంటి మురళి మోహన్ కోడలు. రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడుగా పనిచేసిన మురళి మోహన్ తన వారసురాలిగా రూపను నిలబెట్టారు.

Satyanarayan

Satyanarayana

శ్రీమతి రూప మహిళ కావడంతో రాజమండ్రిలో ఎక్కడికి వెళ్లినా ఆమెకు స్త్రీలు, యువకులు కూడా అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. రాజమండ్రి నుంచి తనను ఎంపీగా గెలిపిస్తే కాలుష్య కోరల్లో చిక్కుకున్న గోదావరిని ప్రక్షాళన చేస్తానని రూప ప్రజలకు హామీ ఇస్తున్నారు. తెలుగు దేశం పార్లమెంట్ సభ్యురాలిగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని వాగ్ధానం చేస్తున్నారు. రూప ప్రచారం విభిన్నంగా, వినూత్నంగా సాగిపోతుంది. ఎక్కడికి వెళ్లినా మహిళలు పెద్ద ఎత్తున హారతులతో స్వాగతం చెబుతున్నారు. రాజమండ్రిలో 70 శాతం గ్రామీణ ఓటర్లు ఉండగా 30 శాతం పట్టణ ఓటర్లు వున్నారు. ఎండను లెక్క చెయ్యకుండా రూప ప్రచారం చేస్తున్నారు. రూపకు మద్దతుగా మురళి మోహన్ కూడా ప్రచారం చేస్తున్నారు. తన విజయంపై రూప ఎంతో ధీమాగా వున్నారు.

-భగీరథ

Related posts