telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నాకు ఏం వద్దు… పీసీసీ ఇస్తే అంతే చాలు

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పీసీసీ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారిపోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఇప్పుడు నూతన పీసీసీ ఎంపిక కోసం రంగంలోకి దిగిన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్.. అందరికీ సమయం ఇచ్చి మరీ.. అభిప్రాయాలు తీసుకుంటున్నారు.. ఇక, పీసీసీ పీఠంపై ఆశలు పెట్టుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి… ఇవాళ ఠాగూర్‌ను కలిశారు.. పీసీసీగా నాకు అవకాశం ఇవ్వాలని ఠాగూర్‌ని అడిగినట్టు తెలిపారు కోమటిరెడ్డి.. దీనిపై రెండు పేజీల లేఖను కూడా ఠాగూర్‌కి ఇచ్చినట్టు వెల్లడించారు. ఇక, ఠాగూర్‌తో భేటీ తర్వాత ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన కోమటిరెడ్డి… ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నాకు సీఎం పదవి పదవి వద్దు.. చివరకు మంత్రి పదవి కూడా అక్కరలేదు.. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా కష్టపడతానని ప్రకటించారు.గతంలో కూడా పీసీసీ అడిగా.. కానీ, ఇవ్వలేదు అని గుర్తుచేసుకున్న కోమటిరెడ్డి… ఈ సారైనా అవకాశం ఇవ్వండి అని ఠాగూర్ ని అడిగానన్నారు. పీసీసీ ఇవ్వగానే పాదయాత్ర మొదలుపెడతానన్న ఆయన.. చివరి వన్ ఇయర్‌లో సిటీలో ఉంటానని తెలిపారు.. పాదయాత్రలో ఊరూరు తిరిగి… ప్రభుత్వాన్ని నిలదిస్తా.. ప్రగతి భవన్ పునాదులు పెకిలిస్తానన్నారు. పీసీసీ అవకాశం కూడా వస్తుంది అని నమ్మకంతో ఉన్నట్టు వెల్లడించారు ఉత్తమ్.. పీసీసీ అడిగే వాళ్లలో నేను సమర్దున్నేనని చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది.

Related posts