telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

కల్తీలేని ఆహారమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ కవిత

MP Kavitha comments BBP Govt.
కల్తీలేని ఆహారమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్  ఎంపీ కవిత అన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా శిల్పారామంలో నిర్వహించిన ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ ముగింపు వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ..కల్తీలేని వ్యవసాయోత్పత్తుల కోసం ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని తెలిపారు. మహిళారైతులను అభివృద్ధి చేసే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.  
ప్రపంచవ్యాప్తంగా ఆర్గానిక్ ఉత్పత్తుల గురించి చర్చించుకుంటున్నారని అన్నారు. రసాయనిక ఎరువులను అధికంగా వినియోగించడంతో ప్రతి వస్తువూ కల్తీమయమై.. ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఒబెసిటీ, డయాబెటిస్ బారినపడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళనకరమన్నారు. ఈ కార్యక్రమంలో  17 రాష్ర్టాల నుంచి వంద మందికిపైగా మహిళా రైతులు, వ్యాపారవేత్తలు, శిశుసంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఎం జగదీశ్, మహిళా ఎంటర్‌ప్రెన్యూర్ కామినిసరాఫ్, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Related posts