telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పరిపాలన వికేంద్రీకరణ వల్ల ఖర్చులు పెరుగుతాయి: గల్లా జయదేవ్

galla jayadev got new responsibilities

పరిపాలన వికేంద్రీకరణ వల్ల ఖర్చులు పెరుగుతాయని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఇది మరింత భారంగా మారుతుందని చెప్పారు.అవసరమైన వసతులన్నీ ఉన్న చోటే రాజధాని ఉండాలని అన్నారు. రాజధానికి కావాల్సినవన్నీ అమరావతిలో ఇప్పటికే ఉన్నాయని చెప్పారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని మౌలిక వసతులు, పరిశ్రమలను బట్టి అంచనా వేయవచ్చని తెలిపారు.

టీడీపీ పాలనలో అభివృద్ధిని వికేంద్రీకరించామని చెప్పారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా కృషి చేశామని చెప్పారు.మన రాష్ట్రంలో అభివృద్ధి చెందిన నగరం ఏదైనా ఉందంటే అది విశాఖ మాత్రమేనని అని గల్లా జయదేవ్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా అత్యంత అభివృద్ధి చెందిన రెండో నగరంగా విశాఖ ఉండేదని చెప్పారు. వైజాగ్ ను కార్యనిర్వాహక రాజధానిగా చేయడం వల్ల మరింత అభివృద్ది జరుగుతుందని అన్నారు.

Related posts