telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

రోడ్డు ప్రమాదం : ప్రధమ చికిత్స చేసిన ..భువనగిరి ‘ఎంపీ’ ..

సాధారణంగా నాయకులు సేవలు చేపించుకుంటారు కానీ చేయరు. చేస్తాం అనే ఓట్లు అడుగుతారు. నేతలలో చాలా మంది నిరక్షరాస్యులుగా ఉండటాన్ని చూస్తున్నాం, అలాగే ఎక్కువ మంది వైద్యులు కూడా రాజకీయాలలోకి వస్తుంటారు, ప్రజాసేవ చేస్తాం అంటారు. అలా రాజకీయాలలోకి వచ్చి, పదవి రాగానే ప్రజలను మరిచిపోయేవారు బోలెడంతమంది. ఆ పదవిలో ఒక వైద్యుడు ఉన్నా కూడా ప్రజాసేవ చేస్తే చాలా సంతోషం. కానీ అటు వైద్యంగాని, ఇటు ప్రజా సేవకు గాని న్యాయం చేయకుండా, కేవలం అధికార వ్యామోహంలో ఉండిపోతుంటారు. కోటికొక్కడు అన్నట్టు, ఎక్కడో ఒకరు వారి వృత్తిని, ప్రజాసేవలకు కూడా న్యాయం చేస్తూ మనిషిగా మానవత్వం చాటుకుంటారు. అంతటి పదవిలో ఉండికూడా, తన వృత్తిని-ప్రజాసేవ దృక్పధాన్ని ప్రతిక్షణం గుర్తుచేసుకుంటూ బ్రతుకుతుంటారు. వారి బ్రతుకు హర్షణీయం.

తాజాగా అలాంటి మంచి నాయకుడు చేసిన పని అందరిచేత ప్రశంసలు అందుకుంటుంది.. కొత్తగా చేసిందేమి కాకపోయినా, ఈ తరంలో నాయకులు చేయలేనిది చేసి ప్రత్యేకతను చాటుకున్నాడు. కారులో తనమానాన తాను వెళుతుండగా, రోడ్డుపక్కనే జనాలు గుమిగూడి ఉన్నారు. అది చూసి విషయం కనుక్కోవాలని వ్యక్తిని పంపాడు. రోడ్డు ప్రమాదం జరిగిందని తెలుసుకొని, హుటాహుటిన ఆ బాధిత వ్యక్తి వద్దకు వెళ్లి పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకొని, అంబులెన్సు కు ఏర్పాటు చేశాడు. ఇంతలో తానే స్వయంగా ప్రధమ చికిత్స చేశాడు. అంబులెన్స్ రాగానే బాధితురాలిని అందులో ఆసుపత్రికి తరలించారు. ఒక ఎంపీ అయ్యుండి కూడా ఆయన ఇంతటి సేవా దృక్పధంతో ముందుకు వెళ్లడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అటువంటి నాయకులు కావాలి. ప్రథమ చికిత్స చేసిన వ్యక్తి మరెవరో కాదు.. భువనగిరి నుండి MP గా గెలిచిన బూర నర్సయ్య గౌడ్. గతంలో ఈయన డాక్టర్ గా పనిచేశారు. అందుకే వృత్తి విలువ తెలిసిన వారు కాబట్టి.. అత్యంత అర్జంట్ పని ఉన్నప్పటికీ.. కారు ఆపి మరీ.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి ప్రథమ చికిత్సనందించారు.

Related posts