telugu navyamedia
news political

నూతన పీఏసీకి చైర్మన్‌గా .. అధిర్ రంజన్ చౌదరి ..

mp adhir rajan as pac chairmen

కాంగ్రెస్ ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌదరిని పీఏసీకి చైర్మన్‌గా నియమిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 24న మొదలైన నూతన పీఏసీకి చైర్మన్‌గా అధిర్ రంజన్ చౌదరి 2020 ఏప్రిల్‌ 30 వరకు వ్యవహరిస్తారు. దీనిలో ఏడుగురు రాజ్యసభ నుంచి, పదిహేను మంది లోక్‌సభ నుంచి సభ్యులుగా ఉంటారు.

దీనిలో ఎక్కువ సంఖ్యలో బీజేపీ ఎంపీలు (9 మంది) ఉండగా, మిగిలిన సభ్యులు వైసీపీ, శివసేన, డీఎంకే, జనతాదళ్ యునైటెడ్, బిజూ జనతాదళ్ పార్టీల నుంచి కమిటీ సభ్యులుగా ఉన్నారు. రాజ్యసభ నుంచి సీఎం రమేశ్, భువనేశ్వర్ కలిత, రాజీవ్ చంద్రశేఖర్, భూపేందర్ యాదవ్, ఎం.వి.రాజీవ్ గౌడ, సుఖేందు శేఖర్ రాయ్, నరేశ్ గుజ్రాల్ పీఏసీ సభ్యులుగా వ్యవహరించనున్నారు.

Related posts

మోదీ 100 రోజుల పాలనలో కీలక నిర్ణయాలు: కిషన్ రెడ్డి

vimala p

ఈ నెల 14వ తేదీని జాతీయ సెలవుగా ప్రకటించిన కేంద్రం

vimala p

చర్చల కోసం .. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ .. తీవ్ర ప్రయత్నాలు..

vimala p