telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహేష్ బాబు తో బాలీవుడ్ హీరో మల్టీ స్టారర్…?

mahesh-ranaveer

 మహేష్ బాబు ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. మహేష్ బాబు రణవీర్ సింగ్‌తో పాటు ఓ అడ్వర్టైజ్‌మెంట్ చేయడం కోసం ముంబై వెళ్లాడు. అక్కడే అడ్వర్టైజ్‌మెంట్ పూర్తయ్యాక.. బాలీవుడ్ బడా నిర్మాత సాజిద్ నాడియాద్వాలాతో ఓ అగ్రిమెంట్ చేసుకోనున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్‌లో మహేష్ బాబుకు మోస్ట్ హ్యాండ్సమ్ అనే పేరు ఎలా ఉందో? బాలీవుడ్‌లో కూడా రణ్ వీర్ సింగ్‌కి అదే రకమైన పేరు ఉంది. ఇద్దరు హ్యాండ్సమ్ హీరోలు కలిసి ఓ సినిమా చెయ్యడం అంటే మాములు విషయం కాదు. మల్టీస్టారర్ సినిమాలు చెయ్యడానికి మహేష్ బాబు కూడా ఎప్పుడూ వెనకాడరు. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో నిజంగానే మల్టీస్టారర్ సినిమా వస్తే అది సెన్సేషన్ అవుతుందని బాలీవుడ్ దర్శక నిర్మాతల అభిప్రాయం. వీరిద్దరికి యాడ్ ఫిల్మ్‌ల కారణంగా చాలా కాలంగా స్నేహం ఉంది. ప్రస్తుతం రణవీర్ ప్రపంచ కప్ కథాంశం ఆధారంగా 83 అనే సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక విడుదల అవ్వడానికి టైం పడుతుంది. ఈ లోపు మహేష్ బాబు చిరంజీవి సినిమాలో నటిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఎంతవరకు ఇదంతా సాధ్యం అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తారు అనే వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి. 

Related posts