telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పెను ప్రమాదం… తృటిలో తప్పించుకున్న బాలీవుడ్ హీరోయిన్

Mounirai

బాలీవుడ్ భామ మౌనిరాయ్ పెను ప్ర‌మాదం నుండి తృటిలో తప్పించుకుంది. 11వ అంత‌స్తు నుండి పెద్ద బండ‌రాయి వ‌చ్చి మౌని రాయ్ కారుపై ప‌డింది. కాని ఈ ప్ర‌మాదంలో ఎవ‌రికి ఎలాంటి హాని జ‌ర‌గ‌లేదు. బాధ్య‌త‌రాహిత్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారిపై త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా మండిప‌డింది. “జూహు సిగ్నల్ నుంచి వెళ్తున్న నేను రెడ్ సిగ్నల్ పడడంతో నా కారును ఆపాను. అనుకోకుండా ఓ పెద్ద బండరాయి వ‌చ్చి నా కారుపై పడింది. అది 11 అంతస్తుల పై నుంచి పడడంతో కారు ముందు భాగం బాగా డ్యామేజ్ అయింది. ఒకవేళ నా కారుపైన కాకుండా.. ఈ దారి వెంట వెళ్ళే ఎవరిపైనైనా పడుంటే పరిస్థితి ఏంటి? ముంబై మెట్రో పనులు ఎంత బాధ్యతారహిత్యంగా కొనసాగుతున్నాయో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ” అని మౌని రాయ్ త‌న ట్వీట్‌లో పేర్కొంది. మౌనిరాయ్ గోల్డ్‌, బ్ర‌హ్మ‌స్త్రా త‌దిత‌ర చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అలరించింది.

Related posts