telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

కాంగ్రెస్ అధ్యక్షుడిగా.. మోతీలాల్ .. తాత్కాలికమే..

motilal wora as temporary president

ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీ వర్కింగ్ కమిటీ దానిని తిరస్కరించింది. ఇకపై అధ్యక్ష పదవిలో ఏమాత్రం కొనసాగలేనని స్పష్టం చేశారు. తాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకునేందుకు దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ పార్టీ శ్రేణులకు రాహుల్ నాలుగు పేజీల బహిరంగ లేఖను కూడా రాశారు.

దానితో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా మోతీలాల్ వోరా(90)ను నియమించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వోరా నూతన అధ్యక్షుడి ఎంపిక పూర్తయ్యే వరకూ పదవిలో కొనసాగుతారు. ఈ నియామకం తొందరగా జరగాల్సింది రాహుల్ పట్టుదలతో ఉండటంతో.. ఇప్పటికైనా జరిగింది.. లేదంటే, వచ్చే ఎన్నికలదాకా నువ్వానేనా అంటూ ఉండేది కాంగ్రెస్ పార్టీ!!

Related posts