telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఈ మహిళకు రెండు గర్భసంచీలు… మరి పిల్లలు…!

Women

ఆస్ట్రేలియాలో రెండు గర్భసంచీలు కలిగిన లారెన్ కాటర్ (34) అనే మహిళ ఇటీవల ఒకే కాన్పులో కవలలకు జన్మనిచ్చింది. మెల్‌బోర్న్‌లో నివాసముంటున్న లారెన్‌ 16 ఏళ్ల వయసులో యుటరస్ డిడెల్‌ఫిస్ అనే కండీషన్‌కు గురైంది. రెండు గర్భసంచీలు, రెండు సర్విక్స్‌లతో పుట్టిన అమ్మాయిలకు ఈ కండీషన్ వస్తుంది. దీని కారణంగా లారెన్ నెలసరి సమయాలలో కూడా ఎంతో వేధనకు గురయ్యేదానని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కండీషన్ ప్రతి 3000 మంది మహిళలలో ఒకరికి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. సహజంగా ఇలా రెండు గర్భసంచీలు కలిగిన మహిళల గర్భం ఇతర మహిళల గర్భం కంటే చాలా చిన్నదిగా ఉంటుందని.. పిల్లలకు జన్మనిచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని డాక్టర్లు తెలిపారు. లారెన్‌కు రెండు గర్భసంచీలు ఉండటంతో.. మొదటిసారి గర్భం దాల్చినప్పుడు కుడిగర్భం ద్వారా ఆడపిల్ల పుట్టిందని.. రెండు సంవత్సరాల తర్వాత ఎడమ గర్భం ద్వారా మగపిల్లోడు పుట్టినట్టు చెప్పింది. ఆ తర్వాత ఒకేసారి కవల పిల్లలకు జన్మనిచ్చి లారెన్ చరిత్ర సృష్టించింది. మొత్తంగా లారెన్‌కు పుట్టిన పిల్లల్లో ముగ్గురు ఆడపిల్లలు, ఒకరు మగపిల్లోడు కాగా.. ఆడపిల్లలు కుడివైపు గర్భంలో, మగపిల్లోడు ఎడమ గర్భంలో జన్మించారు.

Related posts