• Home
  • వార్తలు
  • మాతృభాషే మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది: ఉపరాష్ట్రపతి
రాజకీయ వార్తలు వార్తలు

మాతృభాషే మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది: ఉపరాష్ట్రపతి

Mother tongue is Greatest, Venkaiah Naidu

మాతృభాషే మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. చెన్నైలో గురువారం జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మాతృభాషలో చదివినా ఉన్నత శిఖరాలు చేరుకోగలమని, దీనికి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌లే నిదర్శమని కొనియాడారు. రాజధాని కళాశాల 178వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ.. మాతృభాషపై మమకారం పెంచుకొనే దిశగా యువతకు దిశానిర్దేశం చేశారు.

ఈతరం పిల్ల లు మమ్మీ, డాడీ మాటలు వదిలేసి అమ్మ, నాన్న పిలుపుకి దగ్గరవ్వాలన్నారు. తాను కాన్వెంట్‌లో చదువుకోకపోయినా నేడు ఉప రాష్ట్రపతిగా ఉన్నానని గుర్తుచేశారు. ఆంగ్లం చదువుకోని మోదీ ప్రధానిగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని, పళనిస్వామి కూడా కాన్వెంట్‌లో చదువుకోకుండానే తమిళనాడు సీఎంగా పరిపాలన చేస్తున్నారన్నారు. యతిరాజ్‌ మహిళా కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ప్రసంగిస్తూ.. ప్రపంచంలో ఒక్క భారతదేశంలో మాత్రమే దేవతలు ఉన్నారని , విద్యాశాఖను సరస్వతి, రక్షణశాఖను పార్వతిదేవి, ఆర్థికశాఖను లక్ష్మీదేవి నిర్వహించారని వెంకయ్య అభివర్ణించారు.

Related posts

‘గీత గోవిందం’ సినిమాకి షాక్… నా కథను కాపీ కొట్టారు.. రాఘవేంద్ర రావు

nagaraj chanti

ఆఫ్గన్ లో ఆత్మాహుతి దాడి, 21మంది మృతి…

admin

ఆంధ్రావాళ్ల వ్యాపారాలలో కేటీఆర్‌ భాగస్వామి!

madhu

Leave a Comment