జ్ఞాపకం విద్య వార్తలు సామాజిక

ఈరోజు మదర్ థెరిస్సా వర్ధంతి

mother-theressa

ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని చాటి చెప్పిన గొప్ప మహిళ మదర్ థెరిస్సా. మాటలకు మాత్రమే పరిమితం కాకుండా చేతల్లో చేసి చూపించారు మదర్ థెరిస్సా. ప్రపంచంలోని గొప్ప వనితల్లో మదర్ థెరిస్సా తరువాతే ఎవరైనా. ఈరోజు ఆ మాతృమూర్తి వర్ధంతి.

అల్బేనియా దేశంలోని “ఇప్పుడు స్కోప్టే, మాసిడోనియా) ఓ పట్టణంలో 1910 ఆగష్టు 26న జన్మించారు. 1929 జనవరి 6వ తేదీన భారతదేశంలోని కలకత్తా నగరం చేరుకొని అక్కడ విద్యాబోధన చేస్తూ 1947లో పేదరికాన్ని స్వీకరిస్తున్నట్లుగా ప్రమాణం చేశారు. “శాంతినగర్” అనే పేరుతో అసన్ సోల్ నగరంలో ఓ కాలనీ కట్టుకుని కుష్ఠు రోగులకు సాయం చేశారు. 1952లో మదర్ థెరిస్సా కలకత్తా నగరంలో మొదటి హోమ్ ఫర్ ది డయింగ్ ను ప్రారంభించారు. అధికారుల సహాయంతో ఓ పాడుబడిన దేవాలయాన్ని పేద ప్రజలకు ధర్మశాలగా మార్చి దానికి “కాళీఘాట్ పరిశుద్ధ హృదయ నిలయం (కాళీఘాట్ హోమ్ ఫర్ ది డయింగ్), (నిర్మల్ హృదయ్” గా పేరు మార్చారు. స్త్రీ ధార్మిక సమాఖ్య, మిషనరీస్ అఫ్ ఛారిటిస్ అనే ధార్మిక సంస్థలను నెలకొల్పి పేదలకు, స్త్రీలకు అండగా నిలిచారు. మదర్ థెరిస్సా చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ, భారతరత్న లాంటి అత్యున్నత పురస్కారాలు అందించింది. ఆమె చూపే ప్రేమకు, సేవకు, కరుణకు, దయామయ హృదయానికి “నోబెల్” శాంతి బహుమతి దాసోహం అయ్యింది.

45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో మరియు ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు. మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగా విస్తృతమై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి, హెచ్ఐవి/ఎయిడ్స్, కుష్టు మరియు క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల మరియు కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాథ శరణాలయాలను మరియు పాఠశాలలను స్థాపించింది. మె మరణానంతరం పోప్ జాన్ పాల్ IIచే దైవ ఆశీర్వాదం ( బీటిఫికేషన్)మరియు బ్లెస్డ్ తెరెసా అఫ్ కలకత్తా బిరుదు పొందారు.

ఏప్రిల్ 1996,లో మదర్ థెరీసా క్రిందపడటం వలన ఆమె మెడ ఎముక విరిగింది. ఆగస్టులో ఆమె మలేరియాతో బాధ పడటంతో పాటు గుండె ఎడమభాగంలోని జఠరిక పనిచేయడం మానివేసింది. ఆమెకు గుండె శస్త్రచికిత్స జరిగింది, కానీ ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్న విషయం వెల్లడైంది. మార్చి 13, 1997 న ఆమె మిషనరీస్ అఫ్ ఛారిటీ అధినేత పదవి నుండి వైదొలిగారు. 1997 సెప్టెంబర్ 5న మరణించారు.సెప్టెంబర్, 1997 లో ఆమె అంత్యక్రియలకు ముందు మదర్ థెరీసా భౌతిక కాయాన్ని ఒక వారం రోజులపాటు సెయింట్ థామస్, కోల్‌కతాలో ఉంచడం జరిగింది. భారతదేశంలో అన్ని మతాల ప్రజలకు ఆమె చేసిన సేవలకు కృతజ్ఞతగా ప్రభుత్వం ఆమెకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలను జరిపించింది.

Related posts

భారత్‌కు దెబ్బ మీద దెబ్బ…

jithu j

పరిపూర్ణానందకు.. బాధ్యతలు.. అమిత్ షా పిలుపుతో..

chandra sekkhar

ఉపద్రవం….

chandra sekkhar

Leave a Comment