telugu navyamedia
సినిమా వార్తలు

మోదీ, సల్మాన్, షారూక్ లకు సన్నీ లియోన్ షాక్

Sunny-Leone

శ‌ృంగార తార సన్నీలియోన్ మరోసారి గూగుల్ మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్రిటీల జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. అత్యధికంగా గూగుల్‌లో వెతికిన సెలబ్రిటీల్లో సన్నీలియోన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ సూపర్‌స్టార్స్ సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్‌లను దాటేశారు. గత ఏడాది కూడా ఆమె అగ్రస్థానంలో నిలిచారు. గూగుల్ ఎనలిటిక్స్ ప్రకారం.. సన్నీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, సన్నీ కుటుంబ సభ్యులు, ఆమె బయోపిక్ `కరణ్ జీత్ కౌర్..ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్` , తదితర అంశాల గురించి గూగుల్‌లో నెటిజన్స్ అత్యధికంగా సెర్చ్ చేశారట. దీనిపై సన్నీలియోన్ స్పందిస్తూ “ఇదంతా నా అభిమానుల వల్లే జరిగింది. వారు అందిస్తోన్న సపోర్ట్‌ చూస్తే గొప్పగా అనిపిస్తుంది” అని తెలిపారు. ప్రస్తుతం ఈమె `కోకాకోలా` సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts