telugu navyamedia
news telugu cinema news

మోసగాళ్లు ట్రైలర్ వచ్చేసింది…

మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం మోసగాళ్లు.  ఈసినిమాను జాఫ్రీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా ప్రపంచంలోని అతి పెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాను కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో  తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ విష్ణు సోదరి పాత్రలో నటించనున్నారు. ఇద్దరు కలిసి స్కామ్ చేయనున్నారంట. ఇక ఇతర నటుల విషయానికొస్తే బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నారు. అంతేకాకుండా నవదీప్, సంపత్ రాజ్, నాజర్, పోసాని కృష్ణ మురళీ, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన పాటలు ప్రేక్షకులను బాగా అలరించాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను తారాస్థాయికి తీసుకొని వెళుతోంది. ఈ సినిమాతో విష్ణు అనుకున్న స్థాయి హిట్ అందుకుంటారని ప్రేక్షకులు అంటున్నారు. ఈ సినిమా భారీ హిట్ అందుకుంటుందని మేకర్స్ కూడా నమ్మకంతో ఉన్నారు.

Related posts

“టికెట్లు అమ్ముకొని, పని అయిపోయాక అమ్ముకోవడానికి కాదురా పెట్టింది ఈ పార్టీ”… రాజశేఖర్ పంచ్

vimala p

నటుడిగా మారుతున్న నిర్మాత… “బాక్సర్”లో కీలకపాత్ర

vimala p

సీనియర్‌ జర్నలిస్ట్‌ రాఘవాచారి మృతి.. కేసీఆర్, జగన్ సంతాపం!

vimala p