telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

సివిల్స్ లో .. తెలుగు ఆణిముత్యాలు.. 35కి పైగా..

morethan 35 telugu people got palce in civils

దేశంలోనే అత్యున్నత సర్వీసుగా భావించే ఉద్యోగాల భర్తీ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) నిర్వహించిన సివిల్స్ తుది ఫలితాల్లో 35 మందికిపైగా తెలుగు విద్యార్థులు అత్యున్నత ర్యాంకులు కైవసం చేసుకున్నారు. శుక్రవారం యూపీఎస్‌సీ తుది ఫలితాలను విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి 35 మందికిపైగా ఎంపికైనట్టు తెలుస్తోంది. సివిల్స్‌లోనూ తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. వీరిలో తెలంగాణలోని మిర్యాలగూడకు చెందిన కర్నాటి వరుణ్‌రెడ్డి 7వ ర్యాంకు సాధించి సత్తా చాటగా, ఐదుగురికి వందలోపు ర్యాంకులు దక్కాయి.

అంకితా చౌదరి 14వ ర్యాంకు, శ్రీలక్ష్మి 29వ ర్యాంకు, నాగర్‌కర్నూలు జిల్లా తమ్మన్‌పేటకు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ షాహిద్‌ 57వ ర్యాంకు, తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన గోకరకొండ సూర్యసాయి ప్రవీణ్ చంద్ 64వ ర్యాంకు, మల్లారపు నవీన్‌ 75వ ర్యాంకు, కడప జిల్లా పందిళ్లపల్లికి చెందిన కేవీ మహేశ్వరరెడ్డి 126 సాధించారు. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలంలోని పత్తిపాకకు చెందిన చిట్టిరెడ్డి శ్రీపాల్ 131వ ర్యాంకు, హైదరాబాద్‌కు చెందిన సిరి మేఘన 171వ ర్యాంకు, హైదరాబాద్‌కే చెందిన శివ నీహారిక 237వ ర్యాంకు సాధించారు. రాజస్థాన్‌కు చెందిన కనిష్క్ కటారియా టాప్ ర్యాంకు సాధించాడు. గతేడాది సెప్టెంబరు-అక్టోబరు నెలల్లో మెయిన్స్, ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించిన ఇంటర్వ్యూల ద్వారా మొత్తం 759 మంది సివిల్స్‌కు ఎంపికయ్యారు.

యూపీఎస్సీ పరీక్షల్లో తొలి స్థానంలో నిలిచిని కనిష్క్ కటారియా, తాను విజయం సాధించానంటే, దానికి తన స్నేహితురాలు కారణమని ప్రకటించారు. సివిల్స్ తుది ఫలితాల్లో ఐఐటీ బాంబేలో చదువుకున్న రాజస్థాన్ యువకుడు కనిష్క్ మొదటి స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, తనకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అసలు అనుకోలేదని, తన గార్ల్ ఫ్రెండ్ ప్రోత్సాహంతో పాటు తల్లిదండ్రులు, సోదరి సహకారంతో పరీక్షల్లో విజయం సాధించానని అన్నారు. ప్రజా పాలకుడిగా సేవచేయాలన్నది తన లక్ష్యమని అన్నారు. గణితాన్ని ఆప్షనల్ గా తీసుకున్న కనిష్క్, కంప్యూటర్స్ సైన్స్ లో బీటెక్ కూడా చేశారు.

Related posts