telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

ముంబై : .. మరో 4 రోజులు .. అతి భారీవర్షాలు..

more rainy days to mumbai

ముంబై ఇప్పటికే భారీ వర్షంతో అతలాకుతలమైంది. జనజీవనం స్తంభించింది. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జనాలు ఇంకా తేరుకోకముందే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మరో గుండెలదిరే వార్తను చెప్పింది. వచ్చే 24 గంటల్లో ముంబై, కొంకణ్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

పూణే వాతావరణ శాఖ చీఫ్ అనుపమ్ కశ్యపి, గుజరాత్ పైన ఏర్పడిన ‘ఎయిర్ సైక్లోన్’ కరగడం వల్లే ఈ భారీ వర్షాలు కురిసినట్టు తెలిపారు. కొంకణ తీరంలోని అరేబియన్ సముద్రంలో పీడన ప్రవణత ఏర్పడినట్టు పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఉత్తర కొంకణ ప్రాంతంలో నేటి నుంచి జూలై 2 వరకు భీకర వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. ఆ తర్వాత కూడా భారీ వర్షాలు కురుస్తాయన్నారు. రుతుపవనాలు ప్రస్తుతం మహారాష్ట్ర మొత్తం విస్తరించాయని, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో కొన్ని ప్రాంతాలను తాకాయని పేర్కొన్నారు.

Related posts