telugu navyamedia
crime political Telangana trending

హైదరాబాద్ : మందుల తయారీలో .. శృతి మించుతున్న డ్రగ్స్ వాడకం.. మహిళలే టార్గెట్..

SIT Investigation YS viveka Murder

నేడు మందుల తయారీలో కెటమైన్ అనే డ్రగ్‌ను వాడుతున్న ల్యాబ్‌ను అధికారులు సీజ్ చేశారు. బెంగుళూరులో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన కీలక సమాచారంతో నాచారంలోని ‘ఇంతం’ ల్యాబ్‌లో డ్రగ్ కంట్రోల్ బోర్డు సోదాలు నిర్వహించడంతో అక్రమాల గుట్టు రట్టైంది. దీని తో ఈ ల్యాబ్, డ్రగ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ విచారణలో మందుల తయారీలో కెటమైన్ అనే డ్రగ్ వాడటమే కాకుండా, వాటిని మహిళలపై ప్రయోగాలు నిర్వహిస్తున్నారని స్పష్టమైంది. ఈ డ్రగ్ తీసుకున్న వ్యక్తిలో సెక్స్ హార్మోన్లు పెరిగి, మృగంలా మారతాడని అధికారులు వెల్లడించారు. దీంతో పాటు ఈ డ్రగ్‌ను తీసుకున్న వ్యక్తి దాదాపు ఐదు గంటల పాటు అపస్మారక స్థితిలోనే ఉంటాడని అధికారులు వెల్లడించారు. అధికారులు ల్యాబ్‌ను సీజ్ చేసి, దాని యజమాని వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Related posts

“మా ” ముఖ్యసలహాదారుడిగా మాజీ ఎంపీ కృష్ణంరాజు

vimala p

మళ్ళీ రెచ్చిపోయిన మావోలు.. నేత అపహరణ, హతం..

vimala p

ఉస్మానియా ఆసుపత్రిలో రోగుల ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌

vimala p