telugu navyamedia
ఆరోగ్యం

బత్తాయితో ర‌క్త‌హీన‌త‌కు చెక్‌..

పోషక విలువలతో బాటు ఔషధ పరంగా బత్తాయిలో అనేక లాభాలున్నాయి. స్వీట్ లెమన్, మోసంబి అని పిలువబడే ఈ బత్తాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా జలుబు, జ్వరం వచ్చినపుడు త్వరగా కోలుకోవడానికి దీన్ని రసాన్ని ఇస్తారు. బ‌త్తాయిని హిందీలో మోసంబి అని పిలుస్తారు. బ‌త్తాయిలు సాధ‌ర‌ణంగా నిమ్మ‌కాయ‌లు గా క‌నిపిస్తాయి కాని , ప‌రిమాణంలో నిమ్మ‌కాయ కంటే పెద్ద‌వి ఉంటాయి మ‌రియు రుచిలో తియ్య‌గా ఉంటాయి.

Sweet Lime 'Mosambi' exhibition held in Biswanath district - Sentinelassamబ‌త్తాయిలో ప్ర‌యోజ‌నాలుః-
1. బత్తాయిలో పొటాషియం, ఫాస్పరస్, మినరల్స్ వున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు బత్తాయి రసాన్ని రోజూ ఒక గ్లాసుడు తీసుకోవచ్చు. బత్తాయి రసాన్ని తీసుకోవడం ద్వారా అలసట మాయమవుతుంది.ఇందులో విటిమిన్ బి9, విట‌మిన్-సి ఉంటాయి.
2. బ‌త్తాయి మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులోని ఆమ్లాలు పేగుల్లోని విషపూరిత పదార్థాల్ని పారదోలుతాయి.ఈ జ్యూస్ వల్ల చిగుళ్ళ నొప్పులు, గొంతు సంబంధ ఇన్‌ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి. బత్తాయి రసం చర్మానికి కూడా మంచిదే. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మచ్చల్ని మాయం చేస్తుంది.
3.రక్తంలోని ఎరుపు కణాలను ఇది వృద్ధి చేస్తుంది. రక్తహీనతకు చెక్ పెడుతుంది. పిల్లల్లో పెరుగుదలకు బత్తాయి తోడ్పడుతుంది. వృద్ధుల్లో కీళ్ల నొప్పులను నయం చేస్తుంది. 30 దాటిన మహిళలు రోజు ఒక గ్లాసు బత్తాయి రసం తాగాల్సిందే.

Mosambi juice strengthens bones, know its benefits in 6 points - PressWire18
4. బత్తాయిలోని లో కేలరీలు బరువును తగ్గిస్తాయి. కంటికి మేలు చేసే బత్తాయి.. చర్మ, కేశ ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
5. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను బలాన్ని పెంచుతాయి. అలాగే ఇన్ఫెక్షన్స్, కంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
6. బ‌త్తాయిలో ఫ్లేవనాయిడ్స్ లిమోనేన్ గ్లూకోసైడ్ ఉండటం వలన క్యాన్సర్ వ్యాధిని నియంత్రిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, డిటాక్సిఫైయింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్లతో పొరాడడమే కాకుండా.. అల్సర్, గాయాలకు చికిత్స చేస్తుంది. రక్క ప్రసరణను మెరుగు పరుస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

Related posts