telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

శ్రీలంకలో .. ఇంకా దాడులు జరగనున్నాయి.. : అమెరికా నిఘా సంస్థ

more attacks soon in lanka said america

అమెరికా, ఇప్పటికే వణికిపోతున్న శ్రీలంక దేశానికి సంచలన హెచ్చరిక జారీ చేసింది. ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చ్ పై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులు చేసి 359 మందిని హతమార్చిన ఘటన నేపథ్యంలో అమెరికా రాయబార కార్యాలయం శ్రీలంకకు మరోమారు ఉగ్రదాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ వారంలో శ్రీలంకలోని ప్రార్థనాలయాలపై మరిన్ని ఉగ్రదాడులు జరగవచ్చని అమెరికా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శ్రీలంక పోలీసులు అనుమానాస్పద వ్యక్తుల కోసం గాలింపు చేపట్టారు.

ఈ వారంలో అంటే ఏప్రిల్ 26 నుంచి 28వతేదీ ఆదివారం లోగా కొలోంబోలోని ప్రార్థనాస్థలాలకు ప్రజలు వెళ్లవద్దని అమెరికా రాయబార కార్యాలయ అధికారులు ట్విట్టర్ లో హెచ్చరించారు. ఎక్కువ మంది జనం గుమిగూడవద్దని కూడా అమెరికా రాయబార కార్యాలయం కోరింది. దేశంలో పోలీసు బందోబస్తును పెంచడంతోపాటు అనుమానితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టామని శ్రీలంక ప్రధానమంత్రి రాణిల్ విక్రమ్ సింఘే చెప్పారు. ఈస్టర్ పండుగ రోజు జరిగిన పేలుళ్ల కేసులో ముగ్గురు మహిళలు, ఓ యువకుడి పాత్ర ఉందని అనుమానిస్తున్నామని, వారి వివరాలు అందించాలని శ్రీలంక పోలీసులు ప్రజలను కోరారు.

Related posts