telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

బీహార్ ని కూడా .. పలకరించిన రుతుపవనాలు…

monsoon entered in bihar also

ఆలస్యం అయినా, దేశవ్యాప్తంగా రుతుపవనాలు వ్యాపిస్తూన్నాయి. దీనితో దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. తాజాగా బీహార్ రాజధాని పాట్నాలో కుండపోత వర్షం కురుస్తోంది. ఐఎండీ ప్రకారం.. పాట్నా, దాని పరిసర ప్రాంతాల్లో జూన్ 24 లోపు భారీ వర్షాలు కురవనున్నాయట. ఇవాళ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నట్టు ఐఎండీ వెల్లడించింది.

నైరుతి రుతుపవనాలు దక్కన్ పీఠభూమి, ఉత్తరం, తూర్పు ప్రాంతాల్లో విస్తరిస్తున్నాయి. వాటిలో బీహార్ కూడా ఉంది. అందుకే.. బీహార్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం వల్ల కోల్‌కతా, న్యూఢిల్లీ, బీహార్ మీదుగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని ఐఎండీ విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది.

Related posts