telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మోక్షజ్ఞ .. సినీ ఎంట్రీ ఖాయమేనట..

Balakrishna-and-Mokshagna

నందమూరి బాలకృష్ణ గారి తనయుడు మోక్షజ్ఞ తేజ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు గత కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. అయితే అందులో కొందరు, మోక్షజ్ఞకు సినిమాలపై ఆసక్తి లేదని అంటుంటే, మరికొందరు మాత్రం ఆయన తప్పకుండా సినిమాల్లోకి వస్తాడని అంటున్నారు. అయితే ఈ విషయమై నేడు నందమూరి ఫ్యామిలీకి సన్నిహితులైన వారినుండి వెలువడిన ఒక వార్త ఫిలిం నగర్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. అదేమిటంటే, వాస్తవానికి మోక్షజ్ఞ ఈపాటికే సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సిందట, కానీ అతడి చదువులకు మరికొంత సమయం అవసరమవడంతో, ఎంట్రీ ని మరికొద్దిరోజలు వాయిదా వేయడం జరిగిందని అంటున్నారు. అయన కొంత బొద్దుగా ఉన్నారని, ఇప్పటి హీరోలు ఎక్కువగా సిక్స్ ప్యాక్ వంటివి ప్రయత్నిస్తూనే ఉన్నారట.

మోక్షజ్ఞ ఇప్పటికే తన దేహదారుఢ్యం, నటన, డాన్స్ వంటి పలు విషయాలపై శిక్షణ తీసుకునేందుకు సిద్ధమయ్యారని, ఆ శిక్షణ వీలైనంత త్వరగా పూర్తి చేసి, పూర్తిస్థాయిలో తనను తాను హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాక, సినిమాల్లోకి రావడం జరుగుతుందని అంటున్నారు. కానీ వారు చెప్తున్న వివరాల ప్రకారం, మోక్షజ్ఞ శిక్షణ పూర్తి కావాలంటే మరికొద్దికాలం, అంటే మరొక ఏడాదిపైనే సమయం పెట్టె అవకాశం ఉందని అంటున్నారట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈవార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని, ఒకవేళ నిజమే అయితే మాత్రం, నందమూరి అభిమానులకు ఇది పండుగ వార్తే అని చెప్పాలి….!!

Related posts