హైదరాబాద్ నగరంలోని మొజాంజాహీ మార్కెట్ సమీపంలోని ఓ ఎలక్ట్రానిక్స్ షాప్ లో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా దుకాణంలో మంటలు చెలరేగాయి. సమాచారమందుకున్న అగ్నిపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. లింగోజీగూడ గౌతమినగర్‌లో అగ్నిప్రమాదం జరిగింది.
పేపర్ రోల్, దారాల గోదాంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు అంటుకుని సమాగ్రి మొత్తం కాలిబూడిదయింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో పరిసర ప్రాంత ప్రజలుభయాందోళనకు గురయ్యారు. ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్థి నష్టం జరిగినట్టు భాదితులు పేర్కొన్నారు.