telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మోహన్ లాల్ .. సరికొత్త అవతార్… వైరల్ ..

mohanlal with new look for next project

వయసు మీదపడుతున్నా, మ‌ల‌యాళ మెగాస్టార్ మోహన్ లాల్ జోరు మాత్రం త‌గ్గ‌లేదు. కుర్ర హీరోల‌కి పోటీగా వ‌రుస సినిమాలు చేస్తున్న మోహ‌న్ లాల్ తాజాగా ‘ఇట్టిమాని: మేడ్‌ ఇన్‌ చైనా’ అనే చిత్రం చేస్తున్నారు. జిబి అండ్‌ జోజు ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ పోస్ట‌ర్ విడుద‌లైంది. ఇందులో మోహ‌న్ లాల్ డ్యాన్స‌ర్‌గా స‌రికొత్త లుక్‌లో క‌నిపిస్తున్నారు.

పురాతన క్రిస్టియన్ నృత్యాల‌లో ఒకటైన ‘మార్‌క్కంగళి’ డ్యాన్స్‌ చేసే త్రిసూర్‌ ప్రాంత వాస్తవ్యుడిగా మోహన్‌లాల్‌ పాత్ర ఉంటుందని మాలీవుడ్‌ టాక్‌. గ‌త నెల‌లో ప్రారంభ‌మైన ఈ సినిమా మేజర్‌ షూటింగ్‌ త్రిసూర్‌లో జరగనుంది. కొన్ని సన్నివేశాలను సింగపూర్‌లో ప్లాన్‌ చేశారట టీమ్‌. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు.

సిద్ధిఖీ ద‌ర్శ‌క‌త్వంలో బిగ్ బ్ర‌ద‌ర్ అనే సినిమా చేయ‌నున్నాడు మోహ‌న్ లాల్. ఇందులో స‌ల్మాన్ సోద‌రుడు అర్భాజ్ ఖాన్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు.

Related posts