• Home
  • Trending Today
  • 1000 కోట్ల “మహాభారతం”… కానీ కష్టాలు తప్పట్లేదు…!
Trending Today సినిమా వార్తలు

1000 కోట్ల “మహాభారతం”… కానీ కష్టాలు తప్పట్లేదు…!

mohan lal

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం వలన, ‘మహాభారతం’ రూపొందించడానికి అన్ని భాషల్లోనూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. సముద్రం లాంటి మహాభారతాన్ని తెరక్కించడమంటే అంత సాధారణమైన విషయం కాదు. అప్పట్లో సీనియర్ దర్శకులు తమదైన స్టైల్ లో “మహాభారతం” తెరకెక్కించి సత్తా చాటారు. ప్రస్తుతం రాజమౌళి తన కల “మహాభారతం” అని చెప్పారు. మరోవైపు అమీర్ ఖాన్ కూడా “మహాభారతం”లో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే అందరికంటే ముందే మోహన్ లాల్ భారీ బడ్జెట్ తో మహాభారతంలో నటిస్తున్నట్లు కొన్నేళ్ల క్రితం అధికారిక ప్రకటన వచ్చింది. 1000 కోట్లతో ప్రముఖ వ్యాపార వేత్త బీఆర్‌ శెట్టి సినిమాను నిర్మించనున్నట్లు కథనాలు కూడా చాలానే వచ్చాయి. ప్రముఖ రచయిత ఎమ్‌టీ వాసుదేవన్‌ నాయర్‌ రచించిన “రంధమూలం” అనే నవల ఆధారంగా దర్శకుడు శ్రీ కుమార్ ఇంటర్నేషనల్ లెవెల్లో చిత్రాన్ని తెరకెక్కించాలని సన్నాహాలు కూడా చేశారు.

భీముడి పాత్రను ప్రధానంగా చేసుకుని సాగే ఈ చిత్రంలో భీముడిగా తానే నటించబోతున్నట్టు మోహన్ లాల్ చాలా రోజుల క్రిందట ప్రకటించారు. స్క్రీన్ ప్లే ను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ చిత్రం షూటింగ్ మొదలవ్వకముందే అటకెక్కేటట్లు ఉంది. మూడేళ్లకు కాంట్రాక్ట్ కుదుర్చుకొని సినిమాను స్టార్ట్ చేస్తామని చెప్పారు. నాలుగేళ్లయినా సినిమాను స్టార్ట్ చేయలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన రచయిత కథ కథనాలను తీరిగి ఇప్పించాలని కోర్టుమెట్లు ఎక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను నిర్మిస్తానని చెప్పిన దుబాయ్ వ్యాపారవేత్త ఇటీవల ఆర్థికపరమైన సమస్యల్లో పడటమే ఈ ఆలస్యానికి కారణమని చెప్పుకుంటున్నారు.

Related posts

'రంగస్థల' సంబరాలలో మెగా కుటుంబం…

admin

కళ్యాణ 'భావన'..!

admin

16 యేళ్ళ తరువాత బాలయ్యతో ఆ దర్శకుడు….

jithu j

Leave a Comment