telugu navyamedia
telugu cinema news trending

“అన్నయ్య అనే పదానికి అర్ధం తెలిపిన మహనీయుడు…” ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మోహన్ బాబు ట్వీట్

Mohan-Babu

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులంతా ఆయనకు ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ కుటుంబసభ్యులు.. హైదరాబాద్‌లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి ఆయన సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. బాలకృష్ణ, దగ్గుబాటి పురంధరేశ్వరి దంపతులు, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ఘాట్ వద్ద మహానియుడుకు నివాళుర్పించారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మెగాస్టార్ చిరంజీవి సైతం ట్విట్టర్ ద్వారా నటుడుగా, నాయకుడిగా ఎన్టీఆర్ చేసిన సేవల్ని కొనియాడారు. ఈ సందర్భంగా మంచు మోహన్ బాబు కూడా అన్నగారిని గుర్తు చేసుకున్నారు.

“మా ఇంట్లో పెద్ద కుమారుడ్ని నేనే.. నాకు అన్నయ్య అనే పదానికి అర్ధం తెలిపిన మహనీయుడు, మహోన్నతమైన వ్యక్తి, మహా పురుషుడు, భారతదేశం గర్వించదగినటువంటి నటుడు, నిర్మాత, దర్శకుడు, ముఖ్యమంత్రి మా అన్నయ్య నందమూరి తారక రామారావు గారు. అన్నయ్య ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి దీవెనలు నా కుటుంబానికి ఉండాలని, వారి పుట్టినరోజున జ్ఞాపకం చేసుకుంటూ.. వారికి పాదాభి వందనం.’ అంటూ ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకున్నారు.

అటు మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ కూడా ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ ఒడిలో కూర్చున్న ఫోటోను ఆయన తన సోషల్ మీడియా పేజీల్లో పోస్టు చేశారు. “అన్నగారు మిమ్మల్ని మిస్ అవుతున్నాను” అని మంచు మనోజ్ ట్వీట్ చేశారు.

Related posts

పూరీ జగన్నాథ్‌ కు మహేష్ బాబు బర్త్ డే విషెస్

vimala p

తర్వాత సినిమా వాళ్లతో చేస్తా : దర్శకుడు ‘త్రివిక్రమ్’

ashok

ఈసీఐఎల్‌ లో .. ఇంజినీర్ ట్రైనీకి దరఖాస్తులు..

vimala p