telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అజహరుద్దీన్ కుమారుడి వివాహం.. సీఎం కేసీఆర్ కు ఆహ్వానం

azar kcr

టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ తనయుడు అసద్ అజహరుద్దీన్, టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జాల పెళ్లి ఈ నెల 12న జరగనుంది. వీళ్లిద్దరూ చాలాకాలం నుంచి ప్రేమలో ఉన్నారు. కొన్నిరోజుల క్రితమే అసద్, ఆనమ్ ల నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరి పెళ్లి రిసెప్షన్ కు రావాలంటూ సీఎం కేసీఆర్ ను మహ్మద్ అజహరుద్దీన్, అసద్, సానియా మీర్జా, ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా ఆహ్వానించారు. ఈ మేరకు సానియా సీఎం కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక అందించారు.

Related posts