telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

హైదరాబాద్‌లో ఐపీఎల్‌ మ్యాచులు లేకపోవడానికి అసలు కారణం ఇదే..!

ipl

ఐపీఎల్‌ 2021 మరికొన్ని రోజులున్నే మొదలు కానుంది. అయితే… ఈసారి ఐపీఎల్‌ మ్యాచులు హైదరాబాద్‌లో నిర్వహించడం లేదు. కరోనా వైరస్‌, ఇతర కారణాల వల్ల హైదరాబాద్‌లో ఐపీఎల్‌ మ్యాచులు జరగడం లేదు. అయితే.. దీనిపై సర్వత్రా నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ దీనిపై స్పందించారు. హైదరాబాద్ లో ఐపీఎల్‌ మ్యాచులు నిర్వహించాలని బిసిసిఐని కోరామని అజారుద్దీన్ పేర్కొన్నారు. అయితే.. సౌత్ లో రెండు వేదికలు ఉండడంతో హైదరాబాద్ లో మ్యాచ్ లు నిర్వహించడం లేదని కౌన్సిల్ లో నిర్ణయం తీసుకున్నారని తెలిసిందని పేర్కొన్నారు. హెచ్‌సీఏ అభివృద్ధి కోసం చాలా కష్టపడుతున్నామని.. ఒక్కసారిగా అభివృద్ధి కావాలంటే మ్యాజిక్ చేయాలా…? అని ఫైర్‌ అయ్యారు. నిధులు లేకపోతే అభివృద్ధి ఎక్కడ నుంచి కనిపిస్తుంది..? పాత అసోసియేషన్ టాక్స్ లను తాము చెల్లించామన్నారు. తెలంగాణలో జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి తాము కృషి చేస్తున్నామని.. అసోసియేషన్ గురించి బయట జరుగుతున్న చర్చలు అవాస్తవమని పేర్కొన్నారు. కొంతమంది వ్యక్తులు తమపై అనవసరంగా బురద చల్లుతున్నారని.. కోవిడ్ ఉన్నప్పటికీ అండర్ 19తోపాటు అనేక లీగ్ మ్యాచులు నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. విజయ్ హజారే ట్రోఫీకి ఆటగాళ్ల ఎంపిక విషయంలో అసోసియేషన్ ప్రమేయం లేదని స్పష్టం చేశారు.

Related posts