telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

మొగ్గలు

samajam tiru poetry corner
అశ్రువులను చెక్కిలిపై ఆరబోస్తేనే కదా
అవి మంచుముత్యాల్లా మెరిసిపోయేది
కన్నీళ్లు కనిపించని బాధల గుర్తులు
గడ్డకట్టిన దుఃఖాన్ని ఒంపుకుంటేనే కదా
మనసంతా తేలికయై ఊయలలూగేది
దుఃఖం మనిషిని సాంత్వనపరిచే ఓదార్పు
మనిషి స్వార్ధచింతనను విడనాడితేనే కదా
లోకమంతా మానవతా వెలుగులు నిండేది
స్వార్థం మనిషిని చుట్టుముట్టే విషాదగీతం
మనిషి ఎదలోతుల్ని చూడగలిగితేనే కదా
అలజడుల తరంగాలు ఉవ్వెత్తున ఎగిసిపడేది
మనిషి అంతరంగం ఆటుపోట్ల సంగమం
గాయపడిన గుండెను తడిమితేనే కదా
బాధలు దుఃఖసముద్రమై చెలియలికట్ట దాటేది
గాయాలు మనిషిని మనీషిగా మార్చే శిల్పాలు
    
                          – డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

Related posts