telugu navyamedia
రాజకీయ వార్తలు

సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్..కరోనా వివరాలు తెలిపిన జగన్

cm jagan ycp

కరోనా నివారణ చర్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీకి ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో 25 లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేశామని చెప్పారు.

ప్రతి 10 లక్షల మందికి 47,459 మందికి పరీక్షలు చేశామన్నారు. తాము సాధ్యమైనంత త్వరగా పాజిటివ్ కేసులను గుర్తిస్తున్నామని ఆయన చెప్పారు. పాజిటివ్ కేసుల గుర్తింపుతో మరణాలను అదుపులో ఉంచే అవకాశం ఉంటుందని తెలిపారు.

తాము వైద్య సదుపాయం అందించడమే కాకుండా ఐసోలేషన్ చేస్తున్నామని జగన్ చెప్పారు. కరోనా వచ్చే నాటికి వైరాలజీ ల్యాబ్ కూడా లేదని ఆయన వివరించారు. ఇప్పుడు అన్ని జిల్లాల్లోనూ ల్యాబులు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో 2 లక్షల మంది వాలంటీర్లు కరోనా నివారణ చర్యల్లో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు.

Related posts