telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పెట్టుబడులే .. లక్ష్యంగా మోడీ విదేశీ సమావేశాలు …

modi on jammu and kashmir rule

ప్రపంచ దేశాలు భారత్‌ పట్ల ఎంతో ఆశావహ ధృక్ఫథాన్ని ప్రదర్శిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. దేశ నాయకులు, పారిశ్రామికవేత్తలు ఇలా అన్ని రంగాలవారు మన దేశంపై సానుకూల వైఖరితో ఉన్నారని, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, పేదరిక నిర్మూలనకై భారత్‌ చేస్తున్న కృషిని ప్రశంసిస్తున్నారని తెలిపారు. మోదీ వారం రోజుల అమెరికా పర్యటన ముగిసిన నేపథ్యంలో..అక్కడి విశేషాలను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా లభించిన విశేష ఆదరణ, ఆతిథ్యానికి అమెరికా ప్రజలు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఇండియన్‌ అమెరికన్లు నిర్వహించిన ‘హౌడీ-మోదీ’ కార్యక్రమానికి హాజరైనందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం తన మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. భారత్‌తో బంధానికి అమెరికా ఎంత విలువిస్తోందో దీని ద్వారా అర్థమయిందన్నారు.

ఐక్యరాజ్య సమితి సర్వపత్రినిధి సభ సమావేశాల సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో కూడా చర్చలు జరిపామన్నారు. సంస్కరణ పథంలో దూసుకెళ్తున్న భారత్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సమావేశాలు సాగాయన్నారు. అందులో భాగంగా హ్యూస్టన్‌లో ఇంధన, చమురు రంగాల సీఈవోలతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయన్నారు. భారత్‌లోని అవకాశాల్ని ఒడిసిపట్టేందుకు ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఉన్నాయన్నారు. సర్వప్రతినిధి వేదికగా.. ఆరోగ్యం, వాతావరణ మార్పుల విషయంలో భారత్‌ చేస్తున్న కృషిని ప్రపంచానికి వివరించానని చెప్పారు. ఉగ్రవాదంపై పోరాటానికి విశ్వమంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరాన్ని గుర్తుచేశామని వెల్లడించారు. ఈ పర్యటన భారత్‌కు ఎంతో లబ్ధిచేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts