telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

టీడీపీ శివప్రసాద్ ను .. ప్రశంసించిన మోడీ..

modi praised tdp leader sivaprasad

లోక్ సభ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రధాని మోదీ శివప్రసాద్ పై ప్రశంసలు కురింపించారు. శివప్రసాద్ చాలా మంచి నటుడని మోదీ కితాబిచ్చారు. చిత్రవిచిత్ర వేషధారణతో ఆయన పార్లమెంటులో అందరిని నవ్వించేవారని అన్నారు. తాను సభకు ఎన్ని టెన్షన్లతో వచ్చినా.. శివప్రసాద్ ను చూడగానే అన్నీ మరిచిపోతానని వ్యాఖ్యానించారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా టీడీపీ సభ్యుడు శివప్రసాద్ నిరసన వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు కోరుతూ ఆయన రోజుకో వేషంతో ఇతర టీడీపీ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.

ప్రధాని మోదీ వ్యాఖ్యలపై శివప్రసాద్ మాట్లాడుతూ, .. ‘మోదీ నాకు అద్భుతమైన ప్రశంస ఇచ్చారు. అందరిని ఎగతాళి చేసినట్లు కళ గురించి ఆయన మాట్లాడలేకపోయాడు. మోదీ ప్రశంస నాకు అవసరం లేదు. ఆయన వ్యంగ్యంగా మాట్లాడినా.. ఎలా మాట్లాడినా నాకు ప్రశంస అవసరం లేదు. చంద్రబాబు పోరాటానికి మద్దతుగా హోదా కోసం నా వంతు కృషి చేశా. వేషధారణలో గిన్నిస్ రికార్డు నాకు అవసరం లేదు. ప్రజలకు మేలు జరిగి వారి ప్రేమ ఉంటే చాలు’ అని తీవ్రంగా స్పందించారు.

Related posts