telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఎన్నికల సందర్భంగా .. మోడీకి అంతర్జాతీయంగా గుర్తింపు..ఇదీ ఓట్ల కోసం స్టంటేనా ..!

modi got zayed medal from UAE

ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ కొత్త విధానాలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అంతర్జాతీయంగా గుర్తింపు నిచ్చే కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నారు. తాజాగా ఆయనకు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ప్రధాని మోదీకి తమ అత్యున్నత పౌర పురస్కారం ‘జయాద్ మెడల్’ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రకటించింది. భారత్-యూఏఈల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడేందుకు మోదీ చేసిన కృషికి గానూ ఈ అవార్డును యూఏఈ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జయాద్ ప్రకటించారు.

ఈ అత్యున్నత పురస్కారాన్ని గతంలో బ్రిటన్ రాణి ఎలిజబెత్-2, రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్.డబ్ల్యూ. బుష్, ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ, జర్మనీ ఛాన్స్ లర్ ఏంజెలా మెర్కల్ తదితరులు మాత్రమే అందుకున్నారు. తాజాగా వీరి సరన ప్రధాని మోదీ కూడా చేరడం విశేషం. అయితే ఇది కూడా మోడీ ఎన్నికల స్టంట్ అంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అంతర్జాతీయంగా ఓటు బ్యాంకు (ఇతరదేశాలలో ఉన్న భారతీయుల ఓట్లను) ప్రభావితం చేసేందుకు ఎన్నికల సమయంలోనే ఆర్థిక నేరస్తులను పట్టుకోవడం, ఇలాంటి పురస్కారాలు .. తదితర విషయాలు అంటూ వారు విమర్శిస్తున్నారు. మొత్తానికి మోడీ రూటే వేరు కదా..!

Related posts