telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

స్విస్ ఖాతాలు బయటకు వచ్చినట్టే.. నల్లధనంపై మోడీ తొలిఅడుగు..

modi first step on black money

మోడీ ప్రభుత్వం విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్ల ధనం బయటకు తీస్తామన్న తొలి అడుగువేసింది. ఈ క్రమంలోనే స్విస్ బ్యాంకులో భారత్‌కు చెందిన అకౌంట్ హోల్డర్ల పేర్ల తొలి జాబితా ఆటోమేటిక్‌ రూట్‌లో కేంద్రానికి దొరికింది. ఏఈఓఐ ప్రపంచ స్థాయి ప్రమాణాల పరిధిలో స్విస్‌ బ్యాంకులతో భారత్ ఇప్పటికీ చురుగ్గా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తోంది. ఎక్కువగా లావాదేవీలు జరుపుతున్న 75దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. 2020 సెప్టెంబరు నెల నాటికి మరో జాబితా పంపనున్నట్టు స్విట్జర్లాండ్‌ ఫెడరల్‌ పన్ను విభాగం (ఎఫ్‌టిఏ) ప్రతినిధి తెలిపారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకునే (ఏఐఓఐ) విధానంలో ఈ వివరాలను అందించినట్టు స్విట్జర్లాండ్‌ దేశానికి చెందిన ఫెడరల్‌ ట్యాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌టీఏ)కు చెందిన అధికారి పీటీఐ వార్తాసంస్థకు వెల్లడించారు. ఈ విధానం కింద భారత్‌ దేశం ఇలాంటి వివరాలు పొందడం ఇదే తొలిసారి. ఇందులోని వివరాలన్నీ రహస్యంగా ఉంచాలన్న నిబంధనలు ఉండడంతో వాటిని వెల్లడించలేమని ఎఫ్‌టీఏ అధికారి ఒకరు తెలిపారు.

ఈ సంవత్సరానికి సంబంధించి ఖాతాల వివరాలను మరో తొమ్మిది నెలల తర్వాత అందజేస్తామని తెలిపారు దీని ప్రకారం 2020 సెప్టెంబరులో 2019కి సంబంధించిన వివరాలు అందనున్నాయి. ప్రస్తుతం అందిన వివరాలను పరిశీలిస్తే లెక్కల్లో చూపని ఆదాయం కలిగిన వారిపై విచారణ జరిపే అవకాశం ఉందని భావిస్తున్నారు. డిపాజిట్లతో సహా లావాదేవీలకు సంబంధించిన వివరాలు జాబితాలో ఉన్నాయి. అలాంటి వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన జాబితాలో ఎక్కువగా వ్యాపారులు, ఎన్నారైలు ఉన్నట్టు తెలుస్తోంది నల్లధనం వెలికితీతకు చర్యలు ఉంటాయన్న భయంతో పలువురు తమ ఖాతాలు మూసేశారని, అలాంటి వారి వివరాలు ఎక్కువగా ఉన్నట్టుకూడా తెలుస్తోంది.

Related posts