telugu navyamedia
రాజకీయ

కేంద్ర  మంత్రులకు శాఖలు  ఖరారు!

modi met jaitly at his home

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం నిన్న ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కొత్త కేంద్ర సహాయ మంత్రులకు కాసేపటి క్రితం శాఖలను కేటాయించారు. 17వ లోక్‌సభలో 25 మంది కేబినెట్ మంత్రులుగా, 9 మంది స్వతంత్ర హోదా మంత్రులుగా, 24 మంది సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరందరికి  ఈరోజు శాఖలు కేటాయించారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే క్రమంలో సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి కీలక శాఖను కేటాయించారు. 

కేంద్ర మంత్రులు: 
నరేంద్ర మోదీ – ప్రధానమంత్రి, అణు శక్తి, అంతరిక్షంతో పాటు మంత్రులకు కేటాయించని ఇతర అన్ని శాఖలు
రాజ్‌నాథ్ సింగ్ – రక్షణ శాఖ
అమిత్ షా – హోం శాఖ
నితిన్ గడ్కరీ – రహదారులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
సదానంద గౌడ – ఎరువులు, రసాయనాలు
నిర్మలా సీతారామన్ – ఆర్థిక శాఖ

రామ్ విలాస్ పాశ్వాన్ – వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాలు
నరేంద్ర సింగ్ తోమర్ – వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్
రవిశంకర్ ప్రసాద్ – న్యాయశాఖ, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ

హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ – ఫుడ్ ప్రాసెసింగ్
థావర్‌చంద్ గహ్లోత్ – సామాజిక న్యాయశాఖ
సుబ్రమణ్యం జైశంకర్ – విదేశీ వ్యవహారాలు

రమేశ్ ఫోఖ్రియాల్ – మాననవనరుల శాఖ
అర్జున్ ముండా – గిరిజన వ్యవహారాలు
స్మృతి ఇరానీ – మహిళా శిశు సంక్షేమం, జౌళి

హర్షవర్ధన్ – ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ
ప్రకాశ్ జవదేకర్ – అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఐ అండ్ బీ
పీయూష్ గోయల్ – పరిశ్రమలు, వాణిజ్యం, రైల్వేలు

ధర్మేంద్ర ప్రదాన్ – పెట్రోలియం, ఉక్కు
ముక్తార్ అబ్బాస్ నఖ్వీ – మైనార్టీ వ్యవహారాలు
ప్రహ్లాద్ జోషి – పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనులు

మహేంద్రనాథ్ పాండే – నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ ప్రైన్యూర్ షిప్
అరవింద్ సావంత్ – భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు
గిరిరాజ్ సింగ్ – పాడి, పశుగణాభివృద్ధి, ఫిషరీస్

గజేంద్ర సింగ్ షెకావత్ – జలవనరులు(జల్ శక్తి)
సహాయ మంత్రులు(స్వతంత్ర హోదా): 
సంతోష్ కుమార్ గాంగ్వర్ – శ్రామిక, ఉపాధి కల్పన శాఖ

ఇంద్రజిత్ సింగ్ – ప్రణాళిక, గణాంక శాఖ
శ్రీపాద యశో నాయక్ – ఆయుష్, డిఫెన్స్ శాఖ సహాయమంత్రి
జితేంద్ర సింగ్ – సిబ్బంది వ్యవహారాలు, అణు ఇంధన శాఖ, ఈశాన్య రాష్ర్టాల వ్యవహారాలు, పీఎంవో సహాయ మంత్రి

కిరణ్ రిజిజు – క్రీడలు, యుజవన, మైనార్టీ వ్యవహారాలు
ప్రహ్లాద్ సింగ్ పటేల్ – సాంస్కృతిక పర్యాటక శాఖ
రాజ్ కుమార్ సింగ్ – విద్యుత్, సంప్రదాయేతర విద్యుత్, నైపుణ్యాభివృద్ధి

హర్దీప్ సింగ్ పూరి – గృహ నిర్మాణం, విమానయానం, వాణిజ్య పరిశ్రమల శాఖ
మన్ సుఖ్ మాండవ్య – షిప్పింగ్, రసాయనాలు, ఎరువులు

సహాయ మంత్రులు: 
ఫగన్ సింగ్ కులస్తే – ఉక్కు శాఖ సహాయ మంత్రి
అశ్వినీ కుమార్ చౌబే – ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి
అర్జున్ రామ్ మేఘవాల్ – పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు సహాయమంత్రి

జనరల్ వీకే సింగ్ – రహదారులు, రవాణా శాఖ సహాయ మంత్రి
కిషన్ పాల్ – సాంఘిక న్యాయం, సాధికారత సహాయ మంత్రి
రావు సాహెబ్ దాన్వే – వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ సహాయ మంత్రి

కిషన్ రెడ్డి – హోంశాక సహాయ మంత్రి
పురుషోత్తమ్ రూపాలా – వ్యవసాయం, రైతు సంక్షేమం సహాయ మంత్రి
రాందాస్ అథవాలే – సాంఘిక న్యాయం, సాధికారత సహాయ మంత్రి
సాధ్వి నిరంజన్ జ్యోతి – గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి

బాబులు సుప్రియో – అటవీ పర్యావరణ శాఖ సహాయ మంత్రి
సంజీవ్ కుమార్ బల్యాన్ – పాడి, పశుగణాభివృద్ధి, ఫిషరీస్ సహాయ మంత్రి
ధోత్రే సంజయ్ శ్యామ్ రావు – మానవ వనరుల అభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ మంత్రి
అనురాగ్ సింగ్ ఠాకూర్ – ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి

సురేశ్ చిన బసప్ప – రైల్వే శాఖ సహాయ మంత్రి
నిత్యానంద్ రాయ్ – హోంశాఖ సహాయ మంత్రి
రతన్ లాల్ కఠారియా – జలవనరులు, సాంఘిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి
వి. మురళీధరన్ – విదేశీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి

రేణుకా సింగ్ సరూత – గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి
సోమ్ ప్రకాశ్ – పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయ మంత్రి
రామేశ్వర్ తేలి – ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ర్టీ శాఖ సహాయ మంత్రి

ప్రతాప్ చంద్ర సారంగి – సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఫిషరీస్ శాఖ సహాయ మంత్రి
కైలాస్ చౌదరి – వ్యవసాయం, రైతు సంక్షేమం సహాయ మంత్రి
దేబోశ్రీ చౌదరి – మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి

Related posts