• Home
  • Trending Today
  • రాజమహేంద్రవరం టీచర్ కు ప్రధాని ప్రశంసలు
Trending Today రాజకీయ వార్తలు విద్య వార్తలు

రాజమహేంద్రవరం టీచర్ కు ప్రధాని ప్రశంసలు

Modi Appreciates MS.Meka Susatya Rekha

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని నివేదిత కిషోర్ విహార్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలు మేకా సుసత్య రేఖ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. నిన్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా జాతీయ పురస్కారం అందుకున్నారు రేఖ. అదే వేదికపై ఉన్న ప్రధాని నరేంద్రమోడీ సృజనాత్మకంగా ఆమె బోధించే “మాథ్స్ కబడ్డీ” గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయారు. అంతేకాదు ట్వీట్టర్ వేదికగా ఉపాధ్యాయురాలు రేఖపై ప్రశంసల జల్లు కురిపించారు.

“సుసత్య రేఖ పిల్లలను తరగతి గదివైపు ఆకర్షించడంలో విజయం సాధించారు. భవిష్యత్తులో ఆమె చేపట్టే కార్యక్రమాలు సత్ఫలితాలు ఇవ్వాలని” అని కోరుకుంటూ ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.

పిల్లలతో ప్రాజెక్ట్ వర్క్ చేయించడమంటే ఇంటర్నెట్ నుంచి ఫోటోలు తీసి తయారుచేయడం కాదని, ప్రాజెక్ట్స్ ఎప్పుడూ పిల్లల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీసేలా ఉండాలని, స్కూలుకొచ్చే విద్యార్థికి తరగతి గది పులి బోనులా ఉండి భయపెట్టకూడదని, ఇక అది ఫజిల్ లా ఎప్పటికీ ఉండకూడదని అంటారు సుసత్య రేఖ. పిల్లలకు ఆటపాటలంటే ఎంతో ఇష్టం… అందుకే తన పాఠాల్లో అవి రెండూ మిళితమై ఉంటాయని ఆమె తెలిపారు. సైన్స్, గణితం బోధించే ఆమె తన బోధనకు సృజనాత్మకత జోడించి పిల్లలకు ఆయా సబ్జెక్టులపై ఉండే భయాలను పారద్రోలుతూ అద్భుతం సృష్టిస్తున్నారు ఉపాధ్యాయురాలు రేఖ. అంతేకాదు “రేఖా టీచర్ బడి” పేరుతో ఒక బ్లాగ్ స్పాట్ ను, “మ్యాథ్స్ ప్రాజెక్ట్స్ ఎఫ్-2” పేరుతో ఒక యాప్ ను సుసత్య రేఖ నిర్వహిస్తున్నారు.

Related posts

డాక్టర్ భార్య మృతి కేసులో కీలక మలుపు.. లో దుస్తుల్లో బంగారం, యూఎస్ డాలర్స్

nagaraj chanti

బాలీవుడ్ కు అనుపమ… క్యాస్టింగ్ కౌచ్ నిజమే అంటూ సంచలన వ్యాఖ్యలు

vimala t

దమ్ముంటే పోరాడాలి కానీ నాపై ఇలా రాళ్లదాడి చేయడం ఏంటి… ముఖ్యమంత్రి

nagaraj chanti

Leave a Comment