telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా నుండి కోలుకుంటున్నాము : మోడీ

Modi Mask

ఇన్ని రోజులు ప్రపంచాన్ని వణికించిన కరోనా నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని ప్రధాని మోడీ అన్నారు. ఇళ్ళ నుండి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నామన్న ఆయన ఇది పండుగల సీజన్.. మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మన దేశంలో రికవరీ రేట్ చాలా ఎక్కువన్న ఆయన అమెరికా, బ్రెజిల్ లో కేస్లు మరింత పెరుగుతున్నాయని అన్నారు. మన దేశంలో 90 లక్షల కోవిడ్ బెడ్లు ఖాళీగా ఉన్నాయన్న మోడీ కరోనా వ్యాప్తిని మనం సమర్ధంగా అడ్డుకోగాలిగామని అన్నారు. కేసులు తగ్గాయి కాబట్టి కరోనా పోయిందని భావించద్దన్న ఆయన మాస్కులు లేకుండా తిరిగితే మీ కుటుంబాన్ని రిస్కులో పెట్టినట్టేనని అన్నారు. ఇప్పటికీ చాలా మంది మాస్కులు లేకుండానే బయట తిరుగుతున్నారని కరోనా విజయం సాధిస్తున్నాం కాబట్టి అలసత్వం పనికి రాదని అన్నారు. వ్యాక్సిన్ వచ్చేదాకా పోరాటం ఆగకూడదని వాక్సిన్ కోసం ప్రపంచ దేశాలతో పాటు భారత్ కూడా ఎంతో శ్రమిస్తోందని అన్నారు. ఒకసారి విజయం సాధిస్తే ఆ వ్యాక్సిన్ అందరికీ అందిస్తామని అన్నారు. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకండి మాస్కులు ధరించండని మోడీ తెలిపారు. 

Related posts