telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

Model Schools Admissions Notification

తెలంగాణ రాష్ట్రంలోని 192 మోడల్‌ స్కూళ్లలో 2019-20 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో కొత్త అడ్మిషన్లతో పాటు 7-10 తరగతుల్లో ఖాళీల భర్తీకి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ప్రవేశాల కోసం దరఖాస్తులను ఈ నెల 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఓసీ విద్యార్థులు రూ.100, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 దరఖాస్తు రుసుము చెల్లించాలి.

ఏప్రిల్‌ 6న ప్రవేశ పరీక్షను 6వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు, 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం మధ్యాహ్నం 2–4 వరకు ప్రవేశ పరీక్షను జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు నిర్వహిస్తారు. ఫలితాలను ఆయా మోడల్‌ స్కూళ్లలో అందుబాటులో ఉంచుతారు. పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మే 19 నుంచి 26 వరకు తుది జాబితాను సిద్ధం చేస్తారు. ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను మే 27న విడుదల చేస్తారు. దరఖాస్తుల ఫార్మాట్‌ను ఈ నెల 28 నుంచి తమ వెబ్‌సైట్‌ (telanganams.cgg.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లోనే చేయాలన్నారు.

Related posts