telugu navyamedia
సినిమా వార్తలు

ర్యాంప్ పై వాక్ చేస్తూ కుప్పకూలిన మోడల్… అక్కడికక్కడే మృతి

Male-Model

సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, మోడల్స్ తమ శరీర సౌష్ఠవాన్ని కాపాడుకోవడానికి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. కొన్నిసార్లు మంచినీళ్లు, పండ్ల రసాలతో మాత్రమే కడుపు నింపుకుంటారు. తాజాగా బ్రెజిల్ లో ఓ పురుష మోడల్ క్యాట్ వాక్ చేస్తూ ర్యాంప్ పైనే కుప్పకూలిపోయాడు. బ్రెజిల్ లోని సౌపాలో నగరంలో గత శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే… బ్రెజిల్ కు చెందిన 26 సంవత్సరాల యువ మోడల్ టేల్స్ సోరెస్ శనివారం రాత్రి జరిగిన ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో ర్యాంప్ పై ఓ వైపుకు వెళ్లిన సోరెస్, తిరిగి వెనక్కి వెళుతూ ఒక్కసారిగా పడిపోయాడు. అయితే ఇదంతా షోలో భాగమేనని కార్యక్రమానికి హాజరైన వారంతా భావించారు. అయితే నిర్వాహకులు హుటాహుటిన అంబులెన్సులో సోరెస్ ను తరలించడంతో అంతా కంగుతిన్నారు. కాగా సోరెస్ ఎందుకు చనిపోయాడన్న విషయమై ఇంతవరకూ స్పష్టత రాలేదు. మరోవైపు సోరెస్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఫ్యాషన్ వీక్ సంస్థ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది.

Related posts