telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనా పరీక్షల కోసం మొబైల్ సెంటర్లు

corona moboile centre delhi

దేశంలో తొలి మొబైల్ కరోనా పరీక్షల వాహనాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రారంభించారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ కరోనా పరీక్షలు చేసేందుకు ఈ మొబైల్ టెస్టింగ్ సెంటర్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఆయన అన్నారు.

ఈ సెంటర్ల ద్వారా రోజు 25 ఆర్టీ పీసీఆర్ టెస్టులు, 300 ఎలీసా టెస్టులతో పాటు హెచ్ఐవీ, టీబీ పరీక్షలు కూడా చేసే వీలుందన్నారు. ఫిబ్రవరిలో భారత్ లో కరోనాతో పోరాటం మొదలైందని, అప్పుడు దేశంలో ఒకే ఒక్క కరోనా పరీక్షల కేంద్రం ఉందని, ఇప్పుడు దేశవ్యాప్తంగా 953 ఉన్నాయని మంత్రి వెల్లడించారు. అందులో 699 ప్రభుత్వ ల్యాబ్ లేనని తెలిపారు.

Related posts